ఆన్ లైన్ లో సంపాదన ఎలా సాధ్యం?

ఈ రోజుల్లో అత్యధికంగా స్టూడెంట్స్,గృహిణులు, స్వయం ఉపాధికులు లేక Part Time జాబ్ వర్కర్లు ఆన్ లైన్ లో మనీని ఎలా సంపాదించాలా ? అని వెదుకుతూ వుంటారు. ఎన్నో జాబ్స్ ఉన్నాయని ఎర చూపిస్తున్న కొన్ని మోసకరమైన సంస్థలకు బలవుతూ ఉంటారు. అంతే కాకుండా ఎంతో విలువైన సమయాన్ని, డబ్బును వృధాగా ఖర్చు చేసేస్తారు. దీని కారణంగా సహనం కోల్పోయి ఆన్ లైన్ మనీ సంపాదన అనేది అంతా ట్రాష్, మోసం అనే అభిప్రాయానికి వచ్చేస్తారు!
    నిజానికి వారు తీసుకునే అభిప్రాయం కరెక్టేనా? అంటే ఎంతమాత్రం కరెక్ట్ కాదనేదే మా అభిప్రాయం.
    కంప్యూటర్ ముందు కూర్చుని మీరు యాడ్స్ ను క్లిక్ చేయడం, ఈమెయిల్స్ చదవడం చేస్తే మనీ రాదు. దీని వలన ఇంటర్ నెట్ బిల్లు, మీ సమయం వేస్ట్ అవుతాయి తప్ప మరో ప్రయోజనం లేదు. ఈ విధంగా మోసం చేయడానికి ఎన్నో సంస్థలు ఆన్ లైన్ లో రెడీగా ఉన్నాయి. Neobux లాంటి నమ్మకమైన సైట్స్ కొన్ని ఆన్లైన్ లో ఉన్నా అవిచ్చే డబ్బులు ఆరోజు దాని పనికి ఖర్చయ్యే మీ కరెంట్ బిల్లుకు కూడా సరిపోవు.
    మరి!..ఆన్ లైన్ లో సంపాదన ఎలా సాధ్యం?
    మీరు ఆన్లైన్ లో గ్యారెంటీగా సంపాదించవచ్చు. ఎలాగని అడుగుతారా? లేక మాలో ఏముండాలి? అని అడుగుతారా? అంటే రెండవ ప్రశ్నకు ఆన్సర్ మీవద్ద ఉంటేనే సాధ్యం అవుతుంది. అదేమిటంటే మీలో స్కిల్స్ ఉండాలి. కొత్తగా ఏదైనా చేయాలన్న తపన ఉండాలి. ఏదైనా సృష్టించ గల టాలెంట్ మీవద్ద పుష్కలంగా ఉండాలి. ఇవి ఉంటేనే ఆన్ లైన్ లో మనీ సంపాదన సాధ్యపడుతుంది.
    మీరు సిన్సియర్ గా,సీరియస్ గా సహనంగా వర్కు చేయాలే గాని ఈక్రింది అన్నీ సంస్థల నుండి మీరు ఈజీగానే డబ్బు సంపాదించవచ్చు.
* ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలు * సోషల్ మీడియా సంస్థలు * గూగుల్ ప్రొడక్ట్స్ * బ్లాగులు * వెబ్ సైట్లు ...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మార్గాలు మీకోసం రెడీగా ఉన్నాయి. వాటన్నిటి ద్వారా మీరు చక్కని సంపాదన ఏర్పరచుకోవచ్చు.
     మీరు చేయాల్సిందల్లా ఈ బ్లాగును రెగ్యులర్ గా ఫాలో కావడమే! ఈ బ్లాగు ఆన్ లైన్ లో జల్లెడ వేసి వడబోసి నమ్మకమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది.మీకు కావల్సిన అన్నీ విషయాలను తెలియజేసి, మీ సమస్యలను పూర్తిగా నివారించి మిమ్మల్ని నిజమైన ఆన్ లైన్ సంపాదనా పరులుగా నిలబెడుతుంది. మరి ముందుకు సాగుదామా?

దయచేసి Online Work ను Full Time గా ఎంచుకోవద్దు.

దయచేసి Online Work ను Full Time గా ఎంచుకోవద్దు.
ప్రియులారా! దయచేసి మీరెవరూ మీ స్వంత పనులను మానివేసి Online work ను Full time గా చేసుకోవద్దు. ఏదో మీ Time Pass కోసం చేస్తున్నట్టో లేక Part Time గానో మాత్రమే ఎన్నుకోండి. మీరు దీని యొక్క అవగాహనా పరినితిని పూర్తిగా కలిగిలేరు కాబట్టి ఫుల్ టైమ్ గా ఎంచుకోకపోవడమే నూటికి నూరు పాళ్ళు అంటే 100% మంచిది.
      కేవలం ఆన్లైన్ వర్కునే జీవనాధారంగా చేసుకున్నవారు లేరా? అంటే లక్షల కొద్దీ ఉన్నారు. కానీ వారు ఆ రంగంలో సంపాదించిన జ్ఞానం అమోఘం. దాని వెనుక వారు ఎంతో కృషి, పట్టుదల, తపన కలిగి ఆస్థితికి రాగలిగేరు. మీరు కూడా ఆస్థితికి వెళ్లవచ్చు. దానికి ఎంతో సమయం పడుతుంది. మరి మీరు ఆస్థితికి వచ్చే వరకూ వేరొక ఉపాధి రంగంలో ఉంటే ఈ Online Work రంగంలో మీరు సంతోషంగా ముందుకెళ్లగలరు. మన పనులు మనం చేసుకుంటూ ఖాళీ సమయాన్ని Online Work లో కేటాయించడంలో ఉన్న మజా ఎందులోనూ ఉండదు. ఏ టెన్షన్ కలిగియుండరు. కాబట్టి మీ సమయాన్నంతా దయచేసి వృధా చేసుకోకండి. ఖాళీ సమయాన్ని ఉపయోగించుకోండి.
    మీకు వీలు కుదిరినప్పుడల్లా వేసే ఒకో రాయి పెద్ద రాళ్ళ గుట్టయి కూర్చుంటుంది. అలాగే మీ ఖాళీ సమయంలో వేసిన మీయొక్క ఒకొక్క సబ్జెక్ట్ ఆన్లైన్ లో .ఒక పెద్ద పుస్తకమి కూర్చుంటుంది. కొన్నాళ్ళకు అదే మీకు నిధులు కురిపించే బంగారపుగని గా మారిపోతుంది.
    అదెలాగో, ఏమి చేయాలో అన్నీ మీకు ఈ సైట్ ద్వారా అర్ధమవుతుంది. మీరు చేయాల్సింది కేవలం దీనిని రెగ్యులర్ గా లేక మీకు వీలు కుదిరినప్పుడు ఫాలో కావడమే! మరింకెందుకాలస్యం పదండి ముందుకు...

తెలుగు డబ్బింగ్ సినిమాల సునామీ!

హాయ్ రీడర్స్! ఈరోజు మీకు తెలుగు డబ్బింగ్ సినిమాల బ్లాగ్ ఒకటి పరిచయం చేస్తున్నాను. ఈ సైట్ లింక్ ఇదిగోండి: Telugu Moviez. ఇందులో ప్రతిరోజూ ఒక రెండు,మూడు కొత్త సినిమాలు అప్ లోడ్ చేయబడుతున్నాయి. మీకు తెలుగు డబ్బింగ్ సినిమాల ఇంట్రస్ట్ ఉంటే హ్యాపీగా ఈ బ్లాగ్ నుండి ఉచితంగా మీకు నచ్చిన సినిమాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈమధ్య మన తెలుగు సినిమాలన్నీ పిచ్చి,పిచ్చి ప్రేమ కథలతో విసిగెత్తిస్తున్నాయి కదా! అదే ఈ హాలివుడ్ సినిమాలైతే వింత,వింత ప్రయోగాలతో కూడి చూడడానికి ఇంట్రస్ట్ కలిగిస్తాయి. అదీ మన మాతృభాష కాబట్టి సినిమాను అర్ధం చేసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు.మరెందుకాలస్యం ఆ బ్లాగును ఒక లుక్ వేసేయండి మరి!!!

YouTube ఛానెల్స్ ఎందుకు సస్పెండ్ అయ్యిపోతున్నాయి?

హాయ్ రీడర్స్! ఈరోజు కొత్త ట్రాఫిక్ తో వచ్చేసా. ఈమధ్య కాలంలో మన ఇండియన్స్ యూట్యూబ్ ఛానెల్స్ ఒకొకటిగా గాల్లో కల్సి పోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో తెల్సా? ఒకే సిస్టంలో మన వాళ్లు 5.6 ఈమెయిల్స్ సృష్టించి 10 నుండి 15 ఛానెల్స్ పెడుతున్నారు. నిజానికి ఒక వ్యక్తీ మూడు మెయిల్స్ కంటే ఎక్కువ రన్ చేయడం వలన గూగుల్ సంస్థ పసిగట్టి ఆయా YouTube ఛానెల్స్ ను ఎగరగోడుతుంది. ఇదే కాకుండా ఏమాత్రం కంటెంట్ గాని,Images గాని Tags గాని, టైటిల్ గాని కాపీ అయ్యుండకూడదు. ఇవి ఉంటే ఏదో ఒకరోజు ఛానెల్ ఎగిరిపోవడం ఖాయం. ఇకపోతే అత్యధిక ఇండియన్ YouTube యూజర్లు youtube ఏమాత్రం అంత సెక్యూర్ కాదన్న భావనలోనే ఉన్నారు.
       YouTube పై అంత నమ్మకం పెట్టుకోవడం ప్రమాదకరమన్న అభిప్రాయం వెలువడుతోంది. చూద్దాం ఈవిషయంలో గూగుల్ ఏమి సెలవిస్తుందో?